
వాల్‌నట్‌లు మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనవి. ఇవి అభిజ్ఞా సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, రోజూ లేదా వారానికి కొన్ని సార్లు వాల్‌నట్‌లు తినే పిల్లలు, యువతలో ఏకాగ్రత మెరుగుపడింది. ప్రత్యేకంగా వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ (ALA) మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే నాడీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. బాదంపప్పులు కూడా మెదడుకు చాలా మంచివి. వీటిలో విటమిన్ E, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును రక్షించడంలో, శరీరానికి శక్తినివ్వడంలో సహాయపడతాయి. బాదం పప్పులు ముఖ్యంగా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను అందించడంలో ఉపయోగపడతాయి. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
మరిన్ని వీడియోల కోసం :