Reading Time: < 1 minute
ఏప్రిల్ 1 తర్వాత మారిన పాన్‌ కార్డ్‌ రూల్స్ ఇవే..!

పాన్‌ కార్డు దరఖాస్తు, సవరణలకు సంబంధించి ఇప్పటివరకూ వాడుతున్న పాత ఫారాలైన 49A, 49AAలను రద్దు చేస్తూ వాటి స్థానంలో నాలుగు కొత్త ఫారాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా భారతీయ పౌరులు మరియు ప్రవాస భారతీయుల కోసం ఫారం 93, భారతీయ కంపెనీలు, ట్రస్టులు మరియు సంస్థల కోసం ఫారం 94, విదేశీ పౌరుల కోసం ఫారం 95, విదేశీ సంస్థల కోసం ఫారం 96 ను ప్రవేశపెటింది. దరఖాస్తుదారులు తమ హోదాను బట్టి వాటిని ఎంచుకోవాలి. పాన్ కార్డులో వివరాల మార్పులు లేదా సవరణలు చేసుకోడానికి వ్యక్తుల కోసం ‘పాన్ సీఆర్-01’, సంస్థల కోసం ‘పాన్ సీఆర్-02’ ఫారాలను నోటిఫై చేశారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసేవారు తప్పనిసరిగా నలుపు రంగు సిరాతో, ఆంగ్లంలో పెద్ద అక్షరాల్లోనే నింపాలి. కార్డు పోగొట్టుకుంటే దరఖాస్తుతో పాటు FIR కాపీని జత చేయడం ఇకపై విధిగా మారింది. గుర్తింపు కోసం ఆధార్ కీలకమే అయినా, పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఇకపై ఆధార్‌ను ఏకైక పత్రంగా పరిగణించరు. దీని కోసం మున్సిపల్ జనన ధ్రువీకరణ పత్రం (అక్టోబర్ 1, 2023 తర్వాత పుట్టిన వారికి ఇది తప్పనిసరి). పదో తరగతి సర్టిఫికెట్ లేదా పాస్‌పోర్ట్‌ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ కార్డు ఉండాలి.

మరిన్ని వీడియోల కోసం :

నో మోర్‌ డౌట్స్‌..కన్ఫార్మ్ చేసిన చెర్రీ

రామాయణ టీజర్‌ అంచనాలను అందుకుందా?

హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు

గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం