Reading Time: 2 minutes

Vijay Rashmika: “ఐ లవ్ యూ జయమ్మ”.. రష్మికకు విజయ్ స్పెషల్ విషెస్.. క్రేజీ వీడియో పోస్ట్

Caption of Image.

టాలీవుడ్‌లో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరొందిన విజయ్-రష్మిక జంట మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత వరుస ఈవెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో అభిమానులను అలరిస్తున్న ఈ జంట, రష్మిక బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా వార్తల్లో నిలిచారు.

ఏప్రిల్ 5న రష్మిక 30వ పుట్టినరోజు జరుపుకుంటోంది. పెళ్లి తర్వాత రష్మిక జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు కావడం విజయ్‌కు మరింత స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా విజయ్ తన భార్యకు గుర్తుండిపోయేలా “ఐ లవ్ యూ జయమ్మ” అంటూ ఓ స్పెషల్ వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇపుడు ఈ వీడియో వైరల్ అవుతూ నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటోంది. 

“ఐ లవ్ యూ జయమ్మ”:

ప్రస్తుతం ఈ జంట కలిసి నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్రంలో విజయ్ ‘రణబాలి’ అనే టైటిల్ రోల్‌లో కనిపిస్తుండగా, రష్మిక ‘జయమ్మ’అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగానే  “ఐ లవ్ యూ జయమ్మ” అంటూ విజయ్ విష్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ వీడియోలో జయమ్మ పాత్రకి సంబంధించిన లుక్, మేకప్, నగలు, అలాగే పాత్ర బ్యాక్‌స్టోరీకి సంబంధించిన అంశాలను చూపించారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన బలమని చిత్ర యూనిట్ భావిస్తోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అనంతపురం పరిసర ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగుతోంది.

“ఎందయ్య సామి”:

ఇటీవలే ఈ నూతన వధూవరులకు విషెస్ చెబుతూ ‘రణబాలి’ చిత్రబృందం ఒక మధురమైన కానుకను అందించింది. ఈ సినిమాలోని మొదటి సింగిల్ “ఎందయ్య సామి” సాంగ్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది.

అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట వినగానే మనసును హత్తుకునేలా ఉంది. జానపద బాణీలు, ఆధునిక మెలోడీ మేళవింపుతో సాగే ఈ పాటలో విజయ్, రష్మికల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది.  ఈ పాటను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. 

ఒక వీరోచిత గాథ!

‘రణబాలి’ కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, 19వ శతాబ్దపు భారతీయ చరిత్రలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న పీరియడ్ డ్రామా.1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమచారాం. బ్రిటిష్ వలస పాలనలో భారతీయులు అనుభవించిన అణచివేతను ఇందులో చూపించబోతున్నారు.

ముఖ్యంగా సర్ రిచర్డ్ టెంపుల్, సర్ థియోడర్ హెక్టర్ వంటి క్రూరమైన బ్రిటిష్ అధికారుల విధానాలను ఎదిరించే విప్లవ వీరుడిగా విజయ్ పాత్ర ఉండబోతోందని టాక్.  పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరి బాక్సాఫీస్ వద్ద ‘రణబాలి’ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

©️ VIL Media Pvt Ltd.