చామంతి మొక్కలు అందరి ఇళ్లలో ఉంటాయి. కానీ, కొందరి ఇళ్ళలో మాత్రమే ఇవి మంచిగా పూస్తాయి. మరి కొందరి ఇళ్ళలో పురుగు పడి సరిగా పూయవు. మీరు ఈ నేచురల్ చిట్కాలు పాటిస్తే సీజన్ మొత్తం గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మరి, ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ చూద్దాం..
పించింగ్ తప్పనిసరి: చామంతి మొక్కలు పెంచేటప్పుడు ఈ పనిని ఖచ్చితంగా చేయాలి. మొక్క చిన్నగా ఉన్నప్పుడు కొంచం కత్తిరించాలి. ఇలా చేస్తే తక్కువగా పూసే పూలు ఎక్కువగా పూస్తాయి. అలాగే, కొమ్మల కొమ్మలుగా మొక్క విస్తరిస్తుంది.
చామంతి మొక్కలు పెంచేటప్పుడు దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. రోజుకు కనీసం 5 నుంచి 6 గంటల ఎండ దీనికి చాలా అవసరం.
ఎందుకంటే, నీడలో ఉంటే ఈ పూలు ఎక్కువగా పూయవు. కాబట్టి, మీరు ఇలా చేయండి.
నీరు క్రమంగా పెట్టాలి: మొక్క చుట్టూ ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. కానీ, నీరు మాత్రం అస్సలు నిలబడకుండా చూడండి.
ఒక వేళ తేమ ఆరిపోయినా కూడా కొంచం కొంచం నీరు పెడుతూ ఉండాలి. ఇలా చేస్తే చామంతి పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.
ఎరువులు: చామంతి మొక్కలు పూత దశలో ఉండగానే పశువుల ఎరువులను వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే పూత బాగా వచ్చి చామంతి పూలు గుత్తులు నుంచి మొదలయ్యి బస్తాలు వరకు పూస్తూనే ఉంటాయి. ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.




