బిగ్బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ వైష్ణవి చోడిశెట్టితో అనే అమ్మాయితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు.
అయితే షణ్ముఖ్ కానీ, వైష్ణవి కానీ వారి కుటుంబ సభ్యులు వీరి పెళ్లి పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
షణ్ముఖ్ జస్వంత్ ఫ్రెండ్, ఓ ఫోటోగ్రాఫర్ తన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ పేజీలో షణ్ముఖ్ – వైష్ణవి ల పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు.
‘నా ప్రాణ స్నేహితుడికి పెళ్లి జరిగింది. ఈ ఫోటోలు తీయడం, వీటిని షేర్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది’ అంటూ పోస్ట్ చేసాడు షణ్ముఖ్ జస్వంత్ ఫ్రెండ్. దీంతో ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
వీటిని చూసిన పలువురు సినీ సెలబ్రిటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్ – వైష్ణవి లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా షన్ను – వైష్ణవి సైలెంట్ గా కేవలం కుటుంబాలు, సన్నిహితుల మధ్యే ఓ ప్రైవేట్ రిసార్ట్ లో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది.
కాగా ఫిబ్రవరి 25న షణ్ముఖ్ – వైష్ణవిల ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. కాగా వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధమేనని తెలుస్తోంది. ప్రస్తుతం
కాగా షణ్ణూ భార్య వైష్ణవి పేరు తప్పితే ఇతర సమాచారం దొరకడం లేదు. కానీ నెటిజన్లు మాత్రం ఆమె గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. మరి షన్ను – వైష్ణవి పరిచయం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఎలా ప్రేమలో పడ్డారు? అని తెలుసుకోవాలంటే వీరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే.





