
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోందీ అందాల తార. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ తళుక్కున మెరుస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ సంగతి పక్కన పెడితే.. గత కొన్ని నెలలుగా వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది రష్మి. ఆరోగ్యపరమైన కారణాలతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉండిపోయిందీ ముద్దుగుమ్మ. అలాగే ఈ మధ్య కాలంలో వరుసగా తన ఆత్మీయులను కూడా కోల్పోయిందీ అందాల తార. దీంతో ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు కూడా బాగా దూరంగా ఉంటోంది రష్మి. ఇక ఇటీవలే వారణాసి (కాశీ) పర్యటనకు వెళ్లొచ్చిన రష్మి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
తన కాశీ యాత్రకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన యాంకర్ రష్మీ.. ‘నా నవ్వు చూసి చాలామంది ప్రశ్నించొచ్చు. వారణాసి పర్యటనలో ఇది నా చివరి రోజు. కాశీకి రావడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. గతంలో కాశీ వెళ్లినప్పుడు నా మనసు చాలా భారంగా ఉంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. చాలా తక్కువ సమయంలో చాలా మంది ఆత్మీయులను కోల్పోయాను. ఆ బాధ భరించడం నా వల్ల కాలేదు. ఆ జ్ఞాపకాలను వదిలిపెట్టలేకపోతున్నాను. దేవుడి సంకల్పం లేనిదే ఏ ఆధ్మాత్మిక యాత్ర సాధ్య పడదు. మన చేతుల్లో ఏదీ లేదు. నిజమే నా మొదటి పర్యటనకు ఇప్పటి యాత్రకు చాలా మార్పులు కనిపిస్తున్నాయి. మనషులని కోల్పోవడమనేది మనిషి అనుభవంలో, పరిణామ క్రమంలో ఓ భాగమని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు నేనే చాలా మెరుగ్గా అనిపిస్తున్నాను’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్..
కాగా 2023లో రష్మి నానన్న కన్నమూశారు. ఆ తర్వాత ఏడాది తాతని కూడా కోల్పోయిందీ జబర్దస్త్ యాంకర్. ఇక కొన్ని రోజుల క్రితం భుజానికి సర్జరీ కావడంతో చాలా రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది రష్మి.
బనారస్ పాన్ తింటోన్న రష్మి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.