Reading Time: < 1 minute

యమా స్పీడ్గా వారణాసి షూటింగ్.. ఎనభై శాతం వరకూ షూట్ కంప్లీట్.. చెప్పిన డేట్కే సినిమా రిలీజ్

Caption of Image.

ఏ స్థాయిలో ఉంటాయో.. ఆయన  ఏళ్ల తరబడి చెక్కుతూ షూటింగ్ ఆలస్యం చేస్తాడని,  ఆపై పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌కు కూడా ఎక్కువ సమయం తీసుకుంటారనే అపవాదులు కూడా ఉన్నాయి.  పర్ఫెక్షన్‌‌‌‌ కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకునే జక్కన్న.. ‘వారణాసి’ కోసం రూటు మార్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌ 27న విడుదల అని ఇప్పటికే ప్రకటించిన రాజమౌళి.. అందుకు తగ్గట్టుగా సూపర్‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్‌‌‌‌గా సినిమాను పూర్తి చేస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లోని శంకర్‌‌‌‌‌‌‌‌పల్లిలో వేసిన సెట్స్‌‌‌‌లో షూటింగ్ జరుగుతోంది. మహేష్‌‌‌‌  బాబు, పృథ్విరాజ్‌‌‌‌ సుకుమారన్‌‌‌‌ షూటింగ్‌‌‌‌లో పాల్గొంటున్నారు.  శనివారం ప్రియాంక చోప్రా కూడా షూట్‌‌‌‌లో జాయిన్ అయ్యారు. ముగ్గురి కాంబినేషన్‌‌‌‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ షెడ్యూల్‌‌‌‌తో ఎనభై శాతం వరకూ షూట్ కంప్లీట్ అవనున్నట్టు సమాచారం. అదీకాక గ్రాఫిక్స్‌‌‌‌ సంబంధించిన సన్నివేశాలు ముందుగా చిత్రీకరించి వీఎఫ్‌‌‌‌ఎక్స్‌‌‌‌ కంపెనీలకు అప్పగించారు.  మిగతా సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. తాజా షెడ్యూల్‌‌‌‌ తర్వాత షూటింగ్‌‌‌‌కు బ్రేక్ ఇవ్వనుండగా.. రెండు వారాల పాటు మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌‌‌‌కు వెళ్లనున్నారు. అలాగే రాజమౌళి కూడా ఫారిన్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌ వెళ్లబోతున్నట్టు సమాచారం. తిరిగొచ్చాక చివరి షెడ్యూల్‌‌‌‌ మొదలవనుంది. ఏదేమైనా ఈసారి విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకుండా..  పక్కా  ప్లానింగ్‌‌‌‌తో అనుకున్న తేదీకి ‘వారణాసి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు రాజమౌళి.

©️ VIL Media Pvt Ltd.