Reading Time: < 1 minute
Adivi Sesh Mrunal Thakur Dacoit Trailer Release Review Success Rate

అడివి శేష్ తన కెరీర్‌లో ఎంచుకునే ప్రతి కథా ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది, ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న ‘డెకాయిట్’ సినిమా కూడా అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే, శేష్ తన ‘వంద శాతం సక్సెస్ రేట్’ను ఈ సినిమాతో మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో డెబ్యూ డైరెక్టర్ షనీల్ దేవ్ తెరకెక్కించిన ఈ సినిమా, ప్రేమ అలానే క్రైమ్ మధ్య నలిగిపోయే మనుషుల ఎమోషనల్ రైడ్ అనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇది హరి, జూలియట్ అనే ఇద్దరు ప్రేమికుల కథ. ఇక ట్రైలర్ పరిశీలిస్తే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకున్న హరి, జూలియట్ ఒక ఊహించని ద్రోహం కారణంగా జైలు పాలవుతాడు, అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన అతనికి, జూలియట్ తన అనారోగ్యంతో ఉన్న కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరమైన స్థితిలో ఉంటుంది.

Also Read:Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

తన ప్రేయసి అవసరం కోసం హరి ఒక ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఒక సామాన్య ప్రేమికుడు ‘డెకాయిట్’గా ఎలా మారాడనేదే ఈ చిత్ర ప్రధానాంశం. అడివి శేష్ అమాయకమైన ప్రేమికుడిగా, తెలివి మీరిన నేరస్థుడిగా శేష్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఆయన నటనలో వైవిధ్యం ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. జూలియట్ పాత్రలో మృణాల్ ఒదిగిపోయారు. ఒకవైపు ప్రేమికురాలిగా, మరోవైపు బిడ్డ కోసం తల్లడిల్లే తల్లిగా ఆమె పండించిన ఎమోషన్స్ గుండెలకు హత్తుకునేలా ఉన్నాయి. బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి వంటి దిగ్గజ నటులు ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ ‘పాన్ ఇండియా’ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రేమ కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే ఒక ప్రేమికుడి కథగా, బాక్సాఫీస్ వద్ద ఈ ‘డెకాయిట్’ భారీ విజయాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.