
IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అస్వస్థత కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో, సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడుతుండటం తమకు కలిసొచ్చే అంశమని, గత మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్యాన్ని ఛేదించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అక్షర్ పేర్కొన్నాడు.
ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచులో పలు మార్పులు చేశాం.. హార్దిక్ పాండ్యా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ మ్యాచ్ ఆడటం లేదు.. అతని స్థానంలో దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు.. అలాగే, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కోర్బిన్ బాష్, అల్లా గజన్ ఫర్ స్థానంలో మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చారని తెలిపారు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్:
కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముఖేష్ కుమార్.
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కోర్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.