Reading Time: < 1 minute

చెన్నై: టివికె అధినేత సి. జోసెఫ్ విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్‌లు తప్పుల తడక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 23న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్, తిరుచి తూర్పు అనే రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అయితే, ఆయన సమర్పించిన అఫిడవిట్‌లలో తప్పులు ఉన్నట్లు తెలవడంతో మరోసారి అఫిడవిట్‌ దాఖలు చేశారు.

పెరంబూర్ స్థానం కోసం మార్చి 30న దాఖలు చేసిన అఫిడవిట్‌లో విజయ్ వయస్సు 52 సంవత్సరాలుగా పేర్కొనడంతో పాటు, ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని తెలిపారు. దీనికి విరుద్ధంగా, ఏప్రిల్ 2న తిరుచి తూర్పు స్థానం కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన వయస్సు 51 సంవత్సరాలుగా నమోదు చేయడంతో పాటు, రెండు ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, పెరంబూర్ అఫిడవిట్‌లో రూ.404 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు రూ.410కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. చరాస్తుల విషయంలో తిరుచ్చి తూర్పులోనూ ఇలాంటి వ్యత్యాసమున్న అఫిడవిట్ నే సమర్పించినట్లు తెలుస్తోంది.