
టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit) . ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. లేటెస్ట్ ట్రైలర్ ఈ మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది.
ప్రేమ వర్సెస్ ప్రతీకారం
ట్రైలర్ ఆరంభంలో అడవి శేష్, మృణాల్ మధ్య అందమైన ప్రేమకథను చూపిస్తూ.. పెళ్లి, కుటుంబం వంటి కలలతో వారి భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, కథ ఒక్కసారిగా మలుపు తిరిగి ఒక తీవ్రమైన ద్రోహం వల్ల శేష్ జైలు పాలవుతాడు. అక్కడి నుంచి ఒక సాఫ్ట్ లవర్ పవర్ ఫుల్ ‘డెకాయిట్’గా ఎలా మారాడన్నదే ఈ సినిమా అసలు కథ. శేష్ తన పాత ప్రేయసి జూలియట్ (మృణాల్) కోసం వెతుకుతూ సాగించే ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, వారిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒకవైపు జూలియట్‌కు అర్జెంట్‌గా డబ్బు అవసరం కావడం, దాన్ని సమకూర్చడానికి శేష్ తన క్రిమినల్ బుద్ధితో ప్లాన్ చేసే దోపిడీలు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు
ఈ సినిమా కోసం అడవి శేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ట్రైలర్‌లో కనిపించే జైలు బ్రేక్ సీన్, పోలీస్ ట్రాన్స్‌ఫర్ అటాక్, ఉత్కంఠభరితమైన ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది. కార్ చేజింగ్ సీన్లు, గన్ ఫైట్స్ హాలీవుడ్ యాక్షన్ చిత్రాలను తలపిస్తున్నాయి. అడవి శేష్ గత చిత్రాలు ‘గూఢచారి’, ‘హిట్ 2’ తరహాలోనే ఇందులో కూడా టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.
►ALSO READ | Prabhas: సమ్మర్ వెకేషన్‌లో డార్లింగ్.. ఏ దేశంలో చిల్ అవుతున్నారంటే?
భారీ అంచనాలతో..
ఈ చిత్రంతో షనీల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతంలో అడవి శేష్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, శేష్‌తో కలిసి ఈ కథను సిద్ధం చేశారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. మరో కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ తన నటనతో సినిమాకు వెయిట్ పెంచారు.
‘డెకాయిట్’ చిత్రం కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ఇందులో బలమైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఒక చిన్న అమ్మాయి గతం గురించి వచ్చే సీన్లు కథకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాయి. హిందీ , తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం, విజువల్స్ పరంగా ఎంతో రిచ్‌గా కనిపిస్తోంది. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.