Reading Time: < 1 minute

వాట్సాప్ డీపీకి మరింత ప్రైవసీ

Caption of Image.

వాట్సాప్​లో పెట్టుకునే డీపీ లేదా ప్రొఫైల్​ ఫొటోను మరింత సేఫ్​ జోన్​లో ఉంచేలా ప్రొటెక్షన్​ కల్పిస్తోంది కంపెనీ. ఇందుకోసం ఒక కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్​తో యూజర్లు ప్రొఫైల్​ ఫొటో లేని కాంటాక్ట్​లను కేవలం వాళ్ల పేరు ద్వారానే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా వెంటనే గుర్తుపట్టొచ్చు. సేవ్ చేసిన కాంటాక్ట్​ ఫొటోను వాట్సాప్​ రెండు విధాలుగా చూపిస్తుంది. ఒకటి వాట్సాప్​ అకౌంట్​లో ప్రొఫైల్ పిక్చర్​ లేకపోతే సెట్టింగ్స్లో అడ్రస్​ బుక్​లో సేవ్​ చేసిన ఫొటోను చూపిస్తుంది. ఇది యూజర్​కు మాత్రమే కనిపిస్తుంది.

ప్రొఫైల్ ఖాళీగా కనిపించకుండా ఉండేందుకు డీపీలో ఇతరులకు డిఫాల్ట్ ప్లేస్ హోల్డర్​ కనిపిస్తుంది. దీన్ని ఎలా సెట్ చేయాలంటే.. ప్రైవసీ సెట్టింగ్స్​లో ప్రొఫైల్​ ఫొటోను ‘నో వన్’ లేదా ‘ఎక్సెప్ట్​ మై కాంటాక్ట్స్’ ఆప్షన్స్ సెట్ చేసుకోవడం వల్ల ఎవరూ చూడలేరని తెలిసిందే. కానీ ఇప్పుడు అడ్రస్​ బుక్​లో ప్రైవసీ కోసం సేవ్ చేసి డీపీ ఫొటోను చూడగలరు. ​ప్రొఫైల్​ ఫొటోను ఎవరూ చూడొద్దు అనుకుంటే రాబోయే కొత్త ఫీచర్​ ప్రైవసీ సెట్టింగ్ ద్వారా లాక్ చేయొచ్చు. మీ అకౌంట్ అడ్రస్​ బుక్​లో మాన్యువల్​గా సేవ్ చేసుకున్న ప్రొఫైల్ ఫొటోను ఇతరులు చూడగలరు. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్​లకు మాత్రమే అందుబాటులో ఉంది.

©️ VIL Media Pvt Ltd.