
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా..సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన లక్నో జట్టు ఈ మ్యాచ్ విజయంతో ఖాతా తెరవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో లక్నో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో మణిమరన్ సిద్ధార్త్‌ని జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ రెండు మార్పులు చేసింది. లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్‌లు జట్టులోకి వచ్చారు.
తుది జట్లు:
ఎస్‌ఆర్‌హెచ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లైమ్ లివింగ్‌స్టోన్, అనికెత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్.
ఎల్‌ఎస్‌జి: మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మణిమరన్ సిద్ధార్త్, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.