
IPL ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ Playing XI: ఐపీఎల్ 19వ సీజన్‌లోని తొలి డబుల్ హెడర్ నేడు జరుగుతోంది. తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇరు జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్.
ఇది కూడా చదవండి: కాటేరమ్మ కొడుకు పొగరు ఠక్కున దించేశారుగా.. ఇదే రిపీటైతే బ్యాన్.!
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
రోజులో రెండవ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది.
ఢిల్లీపై ముంబైదే ఆధిపత్యం..
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడగా, ముంబైదే పైచేయిగా ఉంది. ముంబై 21 మ్యాచ్‌లు గెలవగా, ఢిల్లీ 16 మ్యాచ్‌లు గెలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..