Reading Time: < 1 minute

వంటగ్యాస్ కొరత లేదు..ఆందోళన వద్దన్న కేంద్రం

న్యూఢిల్లీ ః దేశంలో వంటగ్యాసు (ఎల్‌పిజి) సరఫరాను మరింత పెంచినట్లు కేంద్రం ఆదివారం ప్రకటించింది. కోట్లాది మంది నిరుపేద కార్మికుల కోసం 5 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎల్‌పిజి కోటా అడుగంటిందనే భయాందోళనలు వద్దని ప్రజలను కోరారు. హర్మూజ్ జలసంధి పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతోందని చమురు మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇక గత నెల 23 నుంచి 5 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం మీద దాదాపు ఆరులక్షల 60వేలకు పైగా ఈ సిలిండర్లను విక్రయించారు. పంపిణీదార్ల వద్దకు కార్మికులు ఎటువంటి నివాస పత్రాలు లేకుండా వెళ్లి , కేవలం తమ గుర్తింపు కార్డు చూపి ఈ చిన్న సిలిండర్లను తీసుకువెళ్లవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90వేలకు పైగా 5 కిలోల సిలిండర్లు (వీటిని ఎఫ్‌టిఎల్ సిలిండర్లు కార్మికులకు అందించారు. అక్రమ నిల్వలను , బ్లాక్ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు గుర్తించి , తగు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని వలసకూలీలకు,, ఇంటి పనిమనుష్యులు, రోజువారి కూలీలలకు, విద్యార్థులకు , పలు వృత్తులలో ఉండి సరైన చిరునామా పత్రాలు లేని వారు నేరుగా వచ్చి5 కిలోల సిలిండర్లు తీసకువెళ్లవచ్చునని ఆలిండియా ఎల్‌పిజి పంపిణీదార్ల సమాఖ్య ప్రెసిడెంట్ చంద్ర ప్రకాశ్ ప్రకటించారు. ఈ చిన్న సిలిండర్ ధర తెలంగాణలో ఇప్పుడు రూ 335 నుంచి రూ 338 పై పైసలుగా పలుకుతోంది, వెంటనే వచ్చి తీసుకుపోవడానికి వీలైన ఈ సిలిండర్లపై ఇప్పుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం అయింది. అయితే ఇది శ్రామిక వర్గాలకు పరిమితం అయింది.