Reading Time: < 1 minute
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. కొంతమంది చిన్నపిల్లలు కలిసి ఒక బొమ్మను పాడెపై శవాన్ని ఎత్తినట్టు అతి జాగ్రత్తగా పైకెత్తి, చిన్న స్ట్రెచ్చర్‌పై ఉంచారు. దానిని భుజాన వేసుకుని, పెద్దల శవయాత్ర మాదిరిగా మౌనంగా, నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మరికొందరు పిల్లలు వారి వెనుక మౌనంగా అనుసరిస్తున్నారు. చూసేవారికి ఇది ఒక ఆటలా అనిపించినా, దాని వెనుక ఉన్న ఆవేదన వర్ణనాతీతం.ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో ప్రతీ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కళ్ల ముందే జరుగుతున్న ఈ దారుణాలు, అంతిమ యాత్రలు వారి లేత మనసులపై తీవ్ర ప్రభావం చూపాయి. చుట్టూ జరుగుతున్న మరణాలనే వారు తమ ఆటగా మార్చుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. బాల్యం అంటే ఆటపాటలతో సాగాలి, కానీ ఇక్కడ మృత్యుఘోషతో సాగుతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజాలోని విషాద పరిస్థితులకు ఈ వీడియో అద్దం పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు