
నేడు ఆర్టిమిస్ తుది మజిలి కనువిందు
హుస్టన్: తాము బయలుదేరిన భూమి మాకు చాలా చాలా చిన్నది అవుతోంది. చేరుకునే చంద్ర మండలం రానురానూ పెద్దగా కన్పిస్తోందని అర్టిమిస్ 2 వ్యోమగాములు ఆదివారం తెలిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక చంద్ర మండల యాత్ర విజయవంత దశకు చేరుకుంది. చంద్రుడి అధిదేవత ఆర్టిమిస్ పేరిట సాగే ఈ యాత్ర ఇప్పుడు చంద్రుడికి చేరుకునే దగ్గరలో ఉంది. సోమవారం ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడియన్‌తో కూడిన వ్యోమగాముల బృందం తమ నిర్ణీత లక్షం చేరకుంటారు. చంద్ర మండలంపై పదిరోజుల పరిభమ్రణ సాగుతుంది. 53 ఏండ్ల క్రితపు అపోలో చంద్ర మండలయాత్రతో పోలిస్తే ఇది మరింత విజయంగా నిలుస్తుందని వీరు ఆశిస్తున్నారు. భూమిని దాటేసుకుని చంద్రుడి వద్దకు చేరుతున్నామని తెలిపిన వ్మోమగాములు తాము ఇంతకు ముందటి వ్యోమగాముల కన్నా అత్యధిక పరిశోధనలకు దిగుతామన్నారు. అంతా బాగానే సాగుతున్నా వీరి రాకెట్‌కు సంబంధించి ఇప్పుడు టాయ్‌లెట్‌లో సాంకేతిక సమస్యలతో మొరాయింపు సాగుతోంది.