Reading Time: < 1 minute

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా

Caption of Image.

హైదరాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. శనివారం (ఏప్రిల్ 4) చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నికను 2026, ఏప్రిల్ 5కు వాయిదా వేశారు. ఎన్నిక సందర్భంగా బీజేపీ చైర్మన్ అభ్యర్థి మౌనికకు ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపారని.. ఆమెను చైర్ పర్సన్‎గా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థికి కూడా ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపారని ఖానాపూర్ ఎమ్మెల్యే, ఎక్స్‎ఆఫిషియో మెంబర్ వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకోవడంతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.

బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళన:

మున్సిపల్ చైర్మన్ పేరును ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించాయి. బీజేపీ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కావాలనే ఎన్నికను వాయిదా వేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. చైర్మన్ పేరు ప్రకటించకుండా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికారులను బెదిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే రంగంలో దిగిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

►ALSO READ | హైదరాబాద్ కాప్రాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత…సీజ్ చేసిన బిల్డింగ్ ను మళ్ళీ నిర్మాణం..

ఎమ్మెల్యే బొజ్జు ఆగ్రహం:

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్  ఎన్నిక ప్రకటన వాయిదాపై ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నిక ఫలితాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. ఏడుగురు సభ్యులు మాకు ఓట్లు  వేశారని.. అయినా ఫలితం ప్రకటించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికకు సంబంధించిన వీడియో రికార్డులు బయటపెట్టాలని కోరారు.

 

©️ VIL Media Pvt Ltd.