
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ బయటకి నెట్టి ఐదేళ్లవుతుందని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీ మారుతానని పిచ్చి ప్రచారం చేస్తున్నారని, ఆనాడు చెప్పుకుందామన్నా ఎవరూ వినలేని పరిస్థితి అన్నారు. ఈటల పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, బొడిగే శోభ పార్టీ మారుతామన్నది అ వాస్తవ మని, పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదని తెలియజేశారు. తమ పార్టీలో ఆ ప్రచారానికి కొందరు ఊతమిస్తున్నారని, పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. జిహెచ్ఎంసి ఎన్నికలపై బిజెపి మంత్రి రఘనందరావు, కొండాతో చర్చిస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం పై ఉద్యమం చేస్తామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.