
హీరో పార్ధ గోపాల్ నిర్మాణంలో దర్శకుడు సూర్య జి.యాదవ్ రూపొందిస్తున్న మూవీ డైమండ్ డెకాయిట్. ఈ సినిమా చిత్ర ట్రైలర్‌ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌ను వీక్షించిన స్పీకర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకడ అప్పారావు, శివాజీరాజా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. హీరో, నిర్మాత పార్ధ గోపాల్ మాట్లాడుతూ “ఇది సాధారణ కథ కాదు. సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్‌టైనర్”అని తెలిపారు. రచయిత, దర్శకుడు సూర్య జి యాదవ్ మాట్లాడుతూ “డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించాము. ప్రతి సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది”అని తెలియజేశారు.