Reading Time: < 1 minute

టీఎన్జీవో ఐఅండ్పీఆర్ యూనిట్ కమిటీ ఎన్నిక

Caption of Image.

బషీర్​బాగ్, వెలుగు: టీఎన్జీవో సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్​పీఆర్) హైదరాబాద్ యూనిట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్​లో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షుడిగా డి. జితేందర్, కార్యదర్శిగా సి. నాగరాజు ఎన్నికయ్యారు. అలాగే అసోసియేటెడ్ అధ్యక్షుడిగా ఎన్. రాజకుమార్, కోశాధికారిగా అఖిల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

కమిటీలోని ఇతర సభ్యులుగా ఇందిరా, దుర్గా ప్రసాద్, నరేశ్, చిరంజీవి, గౌష్ ఫాషా తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని (ముజిబ్) చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.  
 

©️ VIL Media Pvt Ltd.