Reading Time: < 1 minute

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోట్మా పట్టణంలో శనివారం సాయంత్రం ఓ నాలుగు అంతస్తుల హోటల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు వ్యక్తి మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు.  శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హోటల్ ఉన్న స్థలానికి ఆనుకునే నిర్మాణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పారు.