Reading Time: 2 minutes

Rohit Sharma: ధోనీ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. ఆరెంజ్ క్యాప్ని కైవసం చేసుకున్న రోహిత్

Caption of Image.

Rohit Sharma: ఐపీఎల్ 2026 ప్రారంభం నుంచే రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లో 78 రన్స్ చేయగా.. ఈరోజు (2026, ఏప్రిల్ 4న) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ 26 బంతుల్లో 35 పరుగులు చేసి మొత్తం 113 పరుగులతో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ప్లేయర్ కూపర్ కునోలీ 108 పరుగులతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల లిస్టులో రోహిత్ ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 51 సిక్సర్లు కొట్టాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 50 సిక్సులు కొట్టిన మహేంద్ర సింగ్ ధోనీ పేరు ఉన్న రికార్డుని రోహిత్ బ్రేక్ చేసినట్లు అయింది. అలాగే విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 48 సిక్సర్లతో ఈ జాబితాలో ఇంకా వెనకబడి ఉన్నాడు. 

ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు:
క్రిస్ గేల్ (పంజాబ్‌పై): 61
క్రిస్ గేల్ (కేకేఆర్ పై): 54
రోహిత్ శర్మ (ఢిల్లీపై): 51
ధోనీ ( ఆర్సీబీపై): 50
విరాట్ కోహ్లీ (సీఎస్కేపైపై): 48

►ALSO READ | IPL 2026: రఫ్పాడించిన సూర్య, రోహిత్, నమన్.. ఢిల్లీ టార్గెట్ఎంతంటే?

కేవలం రన్స్ చేయడమే కాకుండా, రోహిత్ శర్మ సుమారు 176కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు భరోసా కల్పిస్తున్నాడు. ముఖ్యంగా పుల్ షాట్లు, లాంగ్ ఆన్ దిశగా కొట్టే సిక్సులతో వాంఖడే స్టేడియంలో హోరెత్తించాడు. ఈ సీజన్‌లో రోహిత్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే మరిన్ని రికార్డులు బ్రేక్ కావడం ఖాయమని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. మరోవైపు కింగ్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు, రోహిత్ నెలకొల్పిన ఈ సిక్సర్ల రికార్డును అందుకోవడం కోహ్లీకి ఇప్పుడు సవాల్‌గా మారింది. హిట్ మ్యాన్ బ్యాటింగ్‌లో దూకుడుతో ముంబై జట్టుకు అదనపు బలాన్ని అందిస్తోంది. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ రేసులో రోహిత్, కోహ్లీ మధ్య పోటీ రాబోయే రోజుల్లో మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది.

 

 

©️ VIL Media Pvt Ltd.