Reading Time: < 1 minute
Us Iran War Missing F15 Pilot Mother Post Iran Embassy Response

US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. నెల రోజులు దాటినా, ఇరు పక్షాల మధ్య దాడులు ఆగడం లేదు. మరోవైపు, ఇరాన్ అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చడం సంచలనంగా మారింది. ఏ-10 అటాక్ విమానాన్ని కూడా ఇరాన్ కుప్పకూల్చింది. అయితే, ఎఫ్-15 కూలిపోతున్న సమయంలో ఇద్దరు పైలట్లు విమానం నుంచి బయటపడ్డారు. వీరిలో ఒకరిని అమెరికన్ బలగాలు రెస్క్యూ చేశాయి. మరొకరి ఆచూకీ ఇప్పటికే తెలియరాలేదు.

Read Also: Tamil Nadu Elections: తమిళనాడులో గెలిచేదెవరు.? తాజా సర్వేలో సంచలన ఫలితాలు..

ఇదిలా ఉంటే, గల్లంతైన పైలట్ తల్లి సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టింది. తప్పిపోయిన పైలట్ తమ కుమారుడే అని, అతడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదని, తన కుమారుడి కోసం అలాగే ఇతర పైలట్లందరి కోసం ప్రార్థించమని ఆమె అందరినీ కోరారు.

అయితే, ఆమె పోస్ట్‌పై పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయాలు స్పందించాయి. ‘‘ఇరాన్ చెరలో సురక్షితంగా ఉండటం కన్నా డొనాల్డ్ ట్రంప్ తోనే మీ కుమారుడికి ఎక్కువ ప్రమాదం. అమెరికన్ రెస్క్యూ బృందాల అతడిని కనుగొనే వరకు అతను ఇరాన్ చెరలోనే ఉండేలా ప్రార్థించండి’’ అంటూ పాకిస్తాన్ లోని ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇక సౌతాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం.. ఇరాన్ ఖైదీలను గౌరవంగా చూస్తుందని, ఇరాన్‌కు చాలా ప్రాచీన నాగరికత ఉందని, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ లాగా ఖైదీలను క్రూరంగా హింసించదని రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్ చేసింది.