Reading Time: 2 minutes
Prabhas Fauzi Movie Leaks Legal Warning

Fauzi Movie Leaks: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్‌లో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడంతో చిత్రబృందం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.

READ ALSO: Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

సెట్స్‌లో ప్రభాస్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంపై చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా స్పందించింది. అనధికారికంగా సినిమా కంటెంట్‌ను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. “మా టీమ్ రాత్రింబగళ్లు కష్టపడి వెండితెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి లీకులు మా శ్రమను దెబ్బతీస్తాయి. ఎవరూ కూడా లీకైన ఫోటోలను షేర్ చేయవద్దు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తాం” అని చిత్రబృందం స్పష్టంగా పేర్కొంది. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి కూడా ఎక్స్‌ వేదికగా దీనిపై స్పందిస్తూ.. మ్యాజిక్‌ను పాడు చేయవద్దని, థియేటర్లలో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

ఈ సినిమా కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదని, 1940ల కాలం నాటి పీరియాడిక్ స్టోరీతో సాగే బలమైన ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకుంటుందని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల లీకైన ఫోటోలలో ఆయన వింటేజ్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా ఇమాన్వీ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి అద్భుతమైన మెలోడీలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.

READ ALSO: SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!