
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈనెల 9 నుంచి 24 వరకు నిర్వహించనున్న ‘ప్రధాన్ మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్’ ద్వారా గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యమని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 9న నారాయణపేటలో ప్రారంభమయ్యే ఈ క్రీడా సంబరాల్లో గ్రామ స్థాయి జట్లు ఏప్రిల్ 6లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ క్రీడలు ఈనెల 9 నుంచి 15 వరకు మండల స్థాయిలో, 15 నుంచి 20 వరకు అసెంబ్లీ స్థాయిలో, 21, 22 తేదీల్లో పార్లమెంటరీ స్థాయిలో నిర్వహించబడతాయని, 23న పరుగు పందేలు ఉంటాయని ఆమె వివరించారు. 24న ముగింపు వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు.