
మాదాపూర్, వెలుగు: ప్రతి ఒక్కరూ చేనేత దుస్తులు ధరించి, నేతన్నలను ప్రోత్సహించాలని సినీ నటి అక్కినేని అమల పిలుపునిచ్చారు. శనివారం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సోషలైట్ అలేఖ్యరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఎవ్వాహ్ వీవర్స్ హబ్’ ఎగ్జిబిషన్‌ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. చేనేత అమ్మ చల్లని ఒడివంటిదని అభివర్ణించారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్ లూమ్ వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు.