కావలసిన పదార్థాలు : పండిన టమోటాలు, ఒక కప్పు చెరుకు రసం, చింతపండు చిన్న నిమ్మకాయంత, 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా బెల్లం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి/నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.
టమాటా చెరుకు రసం ఎలా చేయాలంటే? ఒక పాత్రలో మూడు టమోటాలను తీసుకుని కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానికి కొద్దిగా చింతపండు రసం, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకును తీసుకుని కలుపుకోవాలి.
ఇక ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు చెరుకు రసం కూడా పోసి బాగా ఉడికించుకోవాలి.. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, సన్నని మంటపై 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అంటే ఎలాగంటే టమోటాలు మొత్తం పచ్చివాసన పోయే వరకు, అలాగే చారు కూడా చిక్కబడే వరకు వాటిని బాగా మరిగించుకోవాలి.
Rasam 3పోపు పెట్టుకోవాలి: మళ్ళీ వేరే పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేడి చేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టాలి.
ఈ పోపును తీసుకుని మరిగించిన రసంలో దానిని వేసి, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేసి కిందకు దించుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఈ సారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి.




