
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ దగ్గర స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనులు జరుగుతున్న క్రమంలో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రయోగాత్మకంగా వన్‌వే విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.
పంజాగుట్ట నుంచి మాదాపూర్ వెళ్లే వాహనాలను రోడ్ నెం.2 వైపు మళ్లిస్తారు. రోడ్ నెం.45 నుంచి వచ్చే వాహనాలను చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. ట్రయల్ రన్ ఆధారంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భవిష్యత్ నిర్ణయం తీసుకోనున్నారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగించునున్నారు.
#HYDTPinfo
🚧 TRAFFIC ALERT: KBR Park Trial Run 🚧
A trial run will be conducted due to ongoing flyover and underpass construction around KBR National Park on 05.04.2026 (Sunday) from 11:00 AM to 01:00 PM.
⚠️ Traffic Regulations During Trial:
🔹 All surrounding roads will operate… pic.twitter.com/rLGM4p3SUM— Hyderabad Traffic Police (@HYDTP) April 4, 2026
పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్కు వెళ్లేందుకు గాను రోడ్ నెంబర్ 2లో డైవర్షన్ తీసుకొని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్ నెంబర్ 45 కి వెళ్లేందుకు వన్ వేను ఏర్పాటు చేశారు. రోడ్ నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్.2 వైపు మళ్లించనున్నారు.
రోడ్ నెంబర్ 10, 12 నుంచి వచ్చే వాహనాలన్నీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ, బాలకృష్ణ ఇంటి ముందు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్కు చేరుకునే విధంగా డైవర్షన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ అడ్వైజరీలో భాగంగా సూచనలను పాటించాలని బోర్డులు ఏర్పాటు చేశారు.