Reading Time: < 1 minute

నా కొడుకు మృతిపై అనుమానాలున్నాయి.. నిండు సభలో కొంగు చాపి న్యాయం కోరిన ఓ తల్లి

Caption of Image.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఓ తల్లి ఆవేదనకు సాక్ష్యంగా నిలిచాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన రాజవ్వ అనే మహిళ, తన కుమారుడు శ్రీనివాస్ మృతిపై న్యాయం చేయాలంటూ సభలోనే కన్నీటి పర్యంతమైంది. 

రాజవ్వ కుమారుడు శ్రీనివాస్ మే 12, 2025న మృతి చెందారు. అయితే తన కుమారుడి మరణం సహజ మరణం కాదని, దాని వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె మొదటి నుంచి ఆరోపిస్తోంది. జయంతి సభకు హాజరైన ఆమె, స్టేజిపైనే కొంగు చాపి తన కొడుకు మృతిపై CID విచారణ జరిపించాలని వేడుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే తక్షణ స్పందన..

సభలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధితురాలి ఆవేదనను చూసి చలించిపోయారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) ను ఆదేశించారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

►ALSO READ | గిగ్ వర్కర్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి

©️ VIL Media Pvt Ltd.