Reading Time: 3 minutes

ఆమ్‌ఆద్మీపార్టీ రాజ్యసభ ఉపనాయకుడు, యంగ్ డైనమిక్ లీడర్ రాఘవచద్దాను ఆఘమేఘాల మీద తొలగిస్తూ, ఆస్థానంలో పంజాబ్‌కు చెందిన మరో యంపి అశోక్ మిట్టల్‌ను నియమించారు. డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాజ్యసభలో ఉప నాయకుడు ఎవరుండాలి అనేది ఆయన ఇష్టమే కావచ్చును. కానీ, ఆయన్ను తొలిగించిన సందర్భం, తొలిగిస్తూ రాఘవచద్దాకు రాజ్య సభలో మాట్లాడడానికి ప్రాదాన్యత ఇవ్వొద్దు అని రాసిన లేఖ! కేజ్రీవాల్‌ను ఇప్పటివరకు ఒక వ్యక్తిత్వం, అవినీతి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అన్నా లేబుల్ తనకు తానే తుడిచి వేసుకున్నాడు. ఏకవ్యక్తి కేంద్రక రాజకీయ వ్యవస్థ ప్రతినిధి అని తనకు తాను నిరూపించుకున్నారు. రాఘవచద్దాను ఆయన సంధించేబాణాలు, లేవనెత్తే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేక రాజ్యసభ నుండి సస్పెండ్ చేస్తే, దాన్ని బలపరుస్తూ తాను బిజెపికి అసలుసిసలైన ప్రత్యామ్నాయం అని చెప్పుకునే కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం బిజేపిని బేషరతుగా బలపరిచే దిశగా ఉంది, తప్ప మరోరకంగా కనిపించదు. ఆమ్‌ఆద్మీ పార్టీ యంపి రాఘవచద్దా ఇటీవల కాలంలో రాజ్యసభలో కార్పోరేట్ శక్తుల దోపిడీని కొత్తకోణంలో బయట పెట్టాడు.

ముఖ్యంగా వివిధ కంపెనీలు నెల రీఛార్జి పేరుతో 28రోజల కాలపరిమితి నే నెలగా పేర్కొన్నారని రాజ్యసభలో ఎండగట్టారు.వందల కోట్ల రూపాయల రీచార్జ్ కుంభకోణం బయట పెట్టడమే కాక,చట్టసభల ప్రజాప్రతినిధులు నెలకుకేవలం300 రూపాయల రీచార్జ్ నెలకు అపరిమిత వాడకంకుసరిపోతుండగావాళ్ళకు పది వేల రూపాయలు పోన్ చార్జీల క్రింద చెల్లించడం ఎందుకు?ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం కాదా? అని ప్రశ్నించారు.ఇట్లాంటి సంచలనాత్మక విషయాలను ఆయన రాజ్యసభలో ప్రస్తావించడం ద్వారా దేశంలోని యువతలో విపరీతమైన క్రేజ్ వచ్చింది.మద్యతరగతివర్గంతమకు ఓప్రాతినిద్యం లభించింది అనిసంబరపడ్డారు.దీనితో చిర్రెత్తు కొచ్చిన కేజ్రీవాల్ ఆయన్ను రాజ్యసభ ఉపనాయకుడుగా తొలగించడంతో పాటు,ఆయనకు ప్రాదాన్యత ఇవ్వొద్దు అని రాయడం రాజ్యసభ చరిత్రలోనే సంచలనం కలిగించింది.బావ ప్రకటనా స్వేచ్ఛను ఒక పార్లమెంటు సభ్యుడు కు నిరాకరిస్తూ లేక రాయడం అంటే రాజ్యాంగంలోని 19(1)ఏను నిరాకరించడం కేజ్రీవాల్ లాంటి వ్యక్తి రాజకీయ చరిష్మాకు మచ్చననే చెప్పవచ్చును? వాస్తవంగా రాఘవచద్దా లేవనెత్తిన అంశాలు ఆయనతోపాటు ఆమ్‌ఆద్మీపార్టీ కికూడాకీర్తిప్రతిష్ట తెచ్చిపెట్టింది.

కానీ , కేజ్రీవాల్ చర్య దాన్ని తుడిచి పెట్టింది.రాజ్యసభ ద్వారా రాఘవ చద్దా దేశవ్యాప్తంగా అభిమానం సంపాదించుకోవడం ఇష్టంలేదా?తాను కోల్పోయిన స్థానాన్ని రాఘవ చద్దాపూరించుకుంటున్నాడనే అంతర్గత ద్వేషమా? లేదా ప్రత్యామ్నాయ నాయకత్వం స్థానం భర్తీ చేస్తాడనే భయమా?ఏదైనా కావచ్చును.మోత్తం మీద రాఘవ చద్దా ప్రాదాన్యత తగ్గించడంజరిగింది,రేపు ఆయనను పార్టీ నుండి గెంటి వేయడం కూడా జరుగవచ్చును?ఏదిఎలా ఉన్నా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ తన లోపలి మనిషి ని బయట పెట్టుకొని, ప్రశ్నించే స్వభావాన్ని చంపి వేశాడని దేశ యువత భావిస్తుంది.ఇలా ప్రశ్నించే స్వభావాలు గొంతు నులపడం ఒక్క రాఘవచెద్దాతో మొదలు కాలేదు.డిల్లీ ఎన్నికల ముందు మరో రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలైవాల్ ని పార్టీ నుండి సాగనంపారు.అంతకుముందుఆమ్‌ఆద్మీ పార్టీ పెట్టిన తొలినాళ్ళలో యోగేంద్ర యాదవ్,కిరణ్ బేడీ లాంటి ప్రశ్నించే మేదావులను పొమ్మనకుండానే పొగ పెట్టారు. ప్రత్యర్థులపై ప్రశ్నలు వర్షం కురిపించే కేజ్రీవాల్ విచిత్రంగా తమపార్టీ నేతలు ప్రశ్నలు,ఎదుగుదలను సహించలేక పోవడం అనేది ఆయనకు ఆకస్మికంగా వచ్చిన మార్పు కాదు.ఆయనలో దీర్ఘకాలికంగా ఉన్న జబ్బునే? అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా వచ్చిన క్రేజ్ ను వాడుకొని అధికారం లోకి వచ్చిన కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీపార్టీ ని ఓప్రజాస్వామ్య పార్టీగా మలచడం లో విఫలం అయ్యాడు.

నిర్థిష్టంగా ఆమ్‌ఆద్మీపార్టీ కి ఒక రాజకీయ విధానంకానీ , నిర్మాణం కానీ లేదు.వ్యక్తిపూజను అధికారిక ఎజెండాగా చేసిన పార్టీలలో జాబితాలో ఆమ్‌ఆద్మీపార్టీ ఏనాడో చేరిపోయింది.అంతేకాదు ఆపార్టీకి ఏకైక ఏజెండా కేజ్రీవాల్ తప్ప ఒక నిర్దిష్ట రాజకీయ విధానం కానీ, సిద్దాంతం కానీ లేదు,కనీస ప్రజాస్వామ్య నిర్మాణం గానీ లేదు.ఆమ్‌ఆద్మీపార్టీలో సంస్థాగత సమావేశాలు, ఎన్నికలకు ఆవగింజంత చోటు గానీ,కార్యకర్తలు అభిప్రాయాలను గౌరవించడంఅనే అనవాయితీ లేదు.ఆన్లైన్ మిస్డ్ కాల్ సభ్యత్వం హడావిడి తప్ప పార్టీ యూనిట్లను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక చేసింది లేదు.జాతీయకమిటీల నుండి స్థానిక కమిటీ వరకు అన్ని కేజ్రీవాల్ కనుసన్నల్లో కాగితం నియమకాలే తప్ప!ఏనాడు ఆపార్టీ కార్యకర్తలు అభిప్రాయాలకు వేదిక లేదు? రెండేళ్లకు ఒకమారు జాతీయ కౌన్సిల్ జరిపినా అందులోకూడాకేజ్రీవాల్ ప్రసంగం వినడం తప్ప చర్చలు,అభిప్రాయాలకు తావులేదు.ఒక ఆర్థిక, రాజకీయ ఎజెండా స్పష్టత కూడా ఇంతవరకు లేదు.జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తర్వాత కూడా ఆమ్‌ఆద్మీపార్టీ విధానాల్లో మార్పులేదు.

ఆప్ జెండా విషయంలో అదే గందరగోళం నెలకొంది.మోదటతెల్లజెండా, తర్వాతపసుపు పచ్చజెండా, తర్వాత పచ్చజెండా క్రింద బులుగు రంగు.ఇక రాజకీయ పరమైన విధానాల్లో కూడా అంతే.ఒకవైపు భగత్ సింగ్, అంబేద్కర్ బొమ్మలు కుడి,ఎడమలో పెట్టు కుంటారు.మరోవైపు వంద రూపాయల నోటు మీద సరస్వతి, లక్ష్మీదేవి, వినాయకుడు బొమ్మలు ముద్రించాలని బిజెపిని డిమాండ్ చేస్తాడు. జైభజరంగ్ బలీ అంటాడు, అంతలోనే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటాడు. అసలు ఈయన సెక్యలరిస్టా?మతవాదం గూడుకట్టుకున్న మరో రూపమా?స్పష్టత లేదు.అంతేకాదు. ఆయన రాజకీయ విదానాలు వివాదాస్పదమే! ఆమ్‌ఆద్మీపార్టీ ఎవరితో పొత్తులు లేకుండా.దేశవ్యాప్తంగా విస్తరిస్తాము అంటూనే, తనపై బిజెపి ప్రభుత్వం కేసులు పెడుతున్న సమయంలో ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యాడు. ప్రాంతీయ పార్టీలకు మద్దతు కూడగట్టి ప్రధాని కావాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు, కేసీఆర్,శివసేన, మమతా బెనర్జీ, తదితరులతో జట్టు కట్టే ప్రయత్నం చేశారు.

చివరకు ఇండియా కూటమిలో చేరి పోటీ చేసినా కనీసం తాము అధికారం లో ఉన్న డిల్లీ లో ఒక్క స్థానం గెలవకపోగా పంజాబ్ లోకూడా చావుతప్పి కన్నులొట్టపోయి మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించాడు.అటుతర్వాత ఆయన సొంత రాష్ట్రం హర్యానా లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉండి స్వతంత్రం గా పోటీ చేయడంవలన కాంగ్రెస్ ఓటమికి నాంది పలికాడు.సొంతంగాడిపాజిట్లుదక్కలేదు?పర్యవసానంగా డిల్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అదేపాత్ర నిర్వర్తించడం తో పరాజయం పాలవ్వడమేకాక తానుకూడా శాసనసభ్యుడు గా కూడా గెలవలేక ఓడిపోయాడు.ఇవన్నీ కేజ్రీవాల్ స్వయం కృత రాజకీయ అపరాదాలే తప్ప ఆమ్‌ఆద్మీపార్టీ ఓటమి కాదు.ఒకవైపు బిజెపి కాంగ్రెస్ బిటీం అని,మరోవైపు కాంగ్రెస్, బిజెపి బీటీం అని ప్రచారం చేస్తుంటే,కాదు నాది స్వతంత్ర టీం అని చెప్పుకోలేని రాజకీయ సందిగ్థ,అసంబద్ధ స్థితిలో ప్రస్తుతం కేజ్రీవాల్ ఉన్నారు.వచ్చిన అధికారం, అవకాశాలు జాతీయ స్థాయిలో నిలుపుకునే నిర్మాణం గానీ, ప్రజాస్వామ్య విధానం కానీ ఆయనలో కనిపించదు.అనుభవం నుండి నేర్చుకున్నది లేదు. 

– ఎన్.తిర్మల్

94418 64514