
దివంగత నటుడు శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కొండారు వెంకటేష్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ‘ఆస్మాన్’ టైటిల్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్టు తెలియజేస్తూ.. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి సాయి దుర్గ తేజ్ క్లాప్ కొట్టగా, సందీప్ కిషన్ కెమెరా స్విచాన్ చేశాడు. వీరితోపాటు ఈ కార్యక్రమానికి విశ్వక్‌సేన్, రోషన్ కనకాల, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి, నిహారిక కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరై టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.