Reading Time: 2 minutes

IPL 2026: రేపే లక్నో vs హైదరాబాద్ మధ్య మహా సంగ్రామం.. అధిపత్యం ఎవరిదో!

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా.. బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, కోల్‌కతాతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి కొంత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే పరాజయం పాలైన లక్నో, ఈ మ్యాచ్‌తో గెలుపు బాట ఓపెన్ చేయాలని చూస్తోంది. హైదరాబాద్ జట్టుకు ఇది మూడో మ్యాచ్ కాగా, లక్నోకు ఇది సెకండ్ పోరు. 

హెడ్ టు హెడ్ రికార్డులు: 
ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 6 సార్లు పోటీపడ్డాయి. ఈ లెక్కలను పరిశీలిస్తే లక్నో జట్టుదే పైచేయిగా ఉంది. లక్నో 4 మ్యాచ్‌ల్లో గెలవగా, సన్ రైజర్స్ కేవలం 2 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఇక, హైదరాబాద్‌పై లక్నో చేసిన అత్యధిక స్కోరు 205 రన్స్ కాగా, లక్నోపై హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 206 పరుగులు. అలాగే లక్నో 127 పరుగులకు పరిమితం కాగా, హైదరాబాద్ 121 పరుగులకు ఆలౌట్ అయింది. గత సీజన్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచి సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు బౌలింగ్ విభాగం బలంగా ఉంటుందో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

టాస్ ఎవరికి లాభం: 
టాస్ విషయానికి వస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్కీ టీంగా కనపడుతుంది. గత ఆరు మ్యాచులలో 4 సార్లు ఆరెంజ్ ఆర్మీ టాస్ గెలిచింది. లక్నో కేవలం 2 సార్లు మాత్రమే టాస్ గెలిచింది. ఇక టాస్ గెలిచినంత మాత్రాన విజయం వరిస్తుందని చెప్పలేం.. ఎందుకంటే టాస్ గెలిచిన తర్వాత హైదరాబాద్ ఒకసారి బ్యాటింగ్, మరోసారి బౌలింగ్ తీసుకునప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. లక్నో కూడా టాస్ గెలిచినప్పుడు ఒక్కసారే విజయం సాధించింది. అంటే టాస్ కంటే కూడా గ్రౌండ్ లో ప్రదర్శనే గెలుపును నిర్ణయిస్తుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ లో జరగనుండడంతో ఇషాన్ సేనకు కాస్త అనుకూలంగా మారే అవకాశం ఉంది. 

బ్యాటింగ్ vs బౌలింగ్: 
హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ లాంటి విధ్వంసకర ప్లేయర్స్ ఉండటం ఆ జట్టుకు బలంగా చెప్పాలి. లక్నో జట్టు రిషబ్ పంత్ నాయకత్వంలో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగంలో నిలకడ లేమి క్లియర్ గా కనిపిస్తోంది. ఈ ఉత్కంఠభరిత పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి. 
 

©️ VIL Media Pvt Ltd.