
చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష చేదనకు దిగిన గుజరాత్ బ్యాటర్లను అద్భుతమైన బౌలింగ్‌తో కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు జట్టుకు రెండో విజయాన్ని అందించారు. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(73), జోష్ బట్లర్(26), కగిసో రబాడా(24), రషీద్ ఖాన్(23)లు తప్ప మరెవరూ రాణించక పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి, 204 పరుగులు చేసింది గుజరాత్.రాజస్థాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టి గుజరాత్ నడ్డీ విరచగా..
తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్, బర్గర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(55), ధ్రువ్ జురెల్(75) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. వైభవ్ సూర్యవంశీ(31) దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(2/42) రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.