
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నోయిడాలో జాతీయ స్కిల్ డెవలప్మెంట్ -2026 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం ప్రతిష్టాత్మక భారత నైపుణ్యాల పోటీ 2026 లో లోజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. బేగంపేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత కార్గోమెన్ లాజిస్టిక్స్ లో పనిచేస్తున్న మెహ్రునిషా బేగం,
జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో గెలుపొంది, జాతీయ స్థాయికి చేరుకుని ఈ విజయాన్ని సాధించారు. ఈ ఇండియా స్కిల్స్ పోటీలు ప్రాక్టికల్ నేర్పులను, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను ప్రోత్సహించే జాతీయ వేదికగా నిలుస్తున్నాయి. 22 ఏళ్ల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనిలో విజేతలకు అంతర్జాతీయ స్థాయి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ లో కూడా పాల్గొందుకు అవకాశం కలుగుతుంది.