Reading Time: < 1 minute

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మహ్మద్ షమీ షాక్‌ మీద షాక్ ఇచ్చాడు. షమీ వేసిన మొదటి ఓవర్‌ చివరి బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లివింగ్‌స్టోన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, దిగ్వేష్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్(14) కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్‌లో క్లాసెన్(4), నితీశ్(2) ఉన్నారు.