Reading Time: 2 minutes

Rashmika Mandanna: బర్త్‌డే బ్లాస్ట్ అదిరింది.. రగిలే అగ్నిజ్వాలలా రష్మిక.. ‘మైసా’ లుక్ వైరల్

Caption of Image.

పాన్ ఇండియా భాషల్లో వరుస ప్రాజెక్టులతో రష్మిక మందన్న (Rashmika Mandanna) బిజీగా ఉంది. అందులో భాగంగా బాలీవుడ్లో ‘మైసా’ (Mysaa) అనే భారీ ప్రాజెక్ట్ చేస్తోంది. ఇప్పటికే, ఈ మూవీ నుంచి గ్లింప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయగా మంచి స్పందన దక్కించుకుంది. ఈ క్రమంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ పంచుకున్నారు. 

ఏప్రిల్ 5, 2026న రష్మిక తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ‘మైసా’ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలైన పోస్టర్‌లో రష్మిక మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త అవతారంలో కనిపిస్తోంది.

ఈ సినిమాలో ఆమె గిరిజన తిరుగుబాటు యువతిగా, ప్రతీకార భావంతో నిండిన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుంది. పోస్టర్‌లో కనిపించిన ఆమె లుక్, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

మేకర్స్ రష్మికకు విషెష్ చెబుతూ.. “ఆమె తన ఆకర్షణతో పాలించింది, తన హుందాతనంతో గెలిచింది. ఇప్పుడు అగ్నిజ్వాలల వంటి తీవ్ర ఆగ్రహంతో వస్తోంది” అని విష్ చేశారు. అలాగే, “ఎల్లప్పుడూ మెరిసే రష్మిక మందన్నకు మా తరఫున అగ్నిపర్వతంలా ప్రజ్వలించే పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె కెరీర్‌లోనే అత్యంత ఉగ్రమైన నటనను చూడడానికి సిద్ధంగా ఉండండి” అని తెలిపారు.

గోండు తెగల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మునుపెన్నడూ కనిపించని ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవతార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రష్మిక కనిపిస్తూ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది. ఈ  ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రవీంద్ర పుల్లె దర్శకుడు. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్ములా ఫిల్మ్స్  నిర్మిస్తున్న ఈ పాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. జేక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. 2026 లోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మొత్తానికి, Mysaa సినిమా ద్వారా రష్మిక తన కెరీర్‌లో మరో డిఫరెంట్, పవర్‌ఫుల్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ చిత్రం 2026లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

©️ VIL Media Pvt Ltd.