Reading Time: 2 minutes
Bandla Ganesh Sss Movie Paya Paya Song Out Actor Sivaji Tweet

బాలీవుడ్ లెవల్‌లో సెటైర్లు వేయాలన్నా, స్టేజ్ ఎక్కితే పవన్ కళ్యాణ్ నామస్మరణతో ఊగిపోవాలన్నా అది కేవలం మన బండ్లన్నకే సాధ్యం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్, ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘సంప్రదాయని సప్పిని సుద్దపూసని’ (SSS)మూవీతోమన ముందుకు వస్తున్నారు.ఈ సినిమా నుండి తాజాగా ‘పాయా పాయా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటలో కూడా బండ్లన్న తన మార్క్ ‘పవన్ భక్తి’ని వదలలేదు. “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర” అంటూ పవన్ కళ్యాణ్ మీద తనకున్న ప్రేమను పాట రూపంలో చూపించారు.

Also Read : Sobhita Dhulipala : ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీతో సంబంధం లేదు : శోభితా

ఈ పాట చూసిన నటుడు శివాజీ ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. “బండ్ల గణేష్‌కి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమ చాలా స్వచ్ఛమైనది, దానికి ఇంకెవరూ సాటిరారు” అంటూ బండ్లన్న ఎనర్జీని మెచ్చుకున్నారు. ఈ సాంగ్‌లో బండ్ల గణేష్ వేసిన స్టెప్పులు, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే పాత బండ్ల గణేష్‌ ను మళ్ళీ చూస్తున్నట్లు ఉందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న ‘ఈటీవీ విన్’ ఓటీటీలో నేరుగా విడుదల కాబోతోంది. వెండితెరపై నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బండ్లన్న, ఇప్పుడు ఓటీటీలో నటుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.