Reading Time: < 1 minute

మేడారంలో గుడి మెలిగె.. మహా జాతరలో తొలి ఘట్టం

Caption of Image.
  • పవిత్ర జలాలతో వనదేవతల ఆలయాల శుద్ధి
  • ఆలయ ప్రాంగణాలను పుట్టమన్నుతో అలికిన పూజారులు 
  • ఆదివాసీల ఆచారం ప్రకారం రంగు రంగుల ముగ్గులు

ములుగు: సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైంది. జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన ‘గుడి మెలిగే’ (గుడి శుద్ధి) పండుగను ఇవాళ (జనవరి 14) పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకతో మేడారం మహా జాతర తొలి ఘట్టం అధికారికంగా ప్రారంభమైంది.

తెల్లవారుజామునే మేడారంలోని సమ్మక్క ఆలయంలో సిద్ధబోయిన, కొక్కెర వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో కాక వంశీయులైన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. వనదేవతల ఆలయాలను పవిత్ర జలంతో శుద్ధి చేశారు. గుడి శుద్ధి అనంతరం ఆడపడుచులు అడవి నుంచి సేకరించిన పవిత్రమైన పుట్టమన్నుతో ఆలయ ప్రాంగణాలను పూజారులు అలికారు. రంగురంగుల ముగ్గులతో అలం కరించారు. 

ఆదివాసీల ఆచారాల ప్రకారం.. ఈ ‘గుడి మెలిగే’ కార్యక్రమం పూర్తయినప్పటి నుంచే మేడారం ప్రాంతంలో పండుగ వాతావరణం స్టార్టవుతుంది. ఈ కార్యక్రమంతో జాతర పనులు వేగవంతం అవుతాయి. 15 రోజుల తర్వాత జరిగే మహాజాతర కోసం ఇప్పటికే భక్తులు మేడారానికి పోటెత్తుతున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చేభక్తుల కోసం ప్రభుత్వం, ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.