Reading Time: < 1 minute

యూట్యూబ్‎లో విడుదల చేస్తే మాకు సంబంధం లేదు: యశ్ టాక్సిక్ టీజర్ వివాదంపై సెన్సార్ బోర్డు క్లారిటీ..!

Caption of Image.

న్యూఢిల్లీ: కన్నడ రాక్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్’. ‘ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్అప్స్’ అనేది ట్యాగ్ లైన్‎తో వస్తోంది. యశ్ బర్త్ డే (జనవరి 8) సందర్భంగా సినిమాలో అతడి క్యారెక్టర్‎ను రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్‎ను విడుదల చేసింది మూవీ యూనిట్. అయితే ఈ టీజర్‎ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. టీజర్‎లో శ్మశానం దగ్గర కారులో ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

బోల్డ్ సీన్స్ శృతి మించడంతో పలువురు తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా విభాగం, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్, కర్నాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, సామాజిక కార్యకర్త దినేష్ కల్లహల్లితో పాటు పలువురు టాక్సిక్ టీజర్‎పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కి ఫిర్యాదు చేశారు.

ALSO READ : వాళ్లను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను.. తేల్చిచెప్పేసిన మీనాక్షి చౌదరి!

టీజర్‎లోని దృశ్యాలు శృతి మించాయని.. మహిళలు, పిల్లల సామాజిక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంప్లైంట్‎లపై సెన్సార్ బోర్డు వర్గాలు స్పందించాయి. టాక్సిక్ మూవీ టీజర్ యూట్యూబ్‎లో విడుదల చేశారని.. యూట్యూ్బ్ వంటి డిజిటల్ ఫ్లాట్‎ఫామ్‎లు తమ పరిధిలోకి రావని సీబీఎఫ్‎సీ వర్గాలు స్పష్టం చేశాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే ఆన్‌లైన్ ప్రమోషనల్ కంటెంట్ సీబీఎఫ్ పరిధిలోకి రాదని క్లారిటీ ఇచ్చారు.

ALSO READ : మిక్స్‌డ్ టాక్‌తోనూ ప్రభాస్ రికార్డులు.. 4 రోజుల్లోనే 200 కోట్లు దాటేసిన రాజాసాబ్!

కేవలం థియేటర్‎లలో విడుదల అయ్యే సినిమాలు, ట్రైలర్‌లకు మాత్రమే సెన్సార్ సర్టిఫికేట్ అవసరమని పేర్కొన్నాయి. టాక్సిక్‌ మూవీకి సంబంధించిన ఏ కంటెంట్‌కీ ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేషన్ ఇవ్వలేదని, సర్టిఫికేషన్ కోసం ఎటువంటి మూవీ యూనిట్ దరఖాస్తు కూడా సమర్పించలేదని సెన్సార్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. యూట్యూబ్‎లో విడుదల చేసిన టీజర్‌కు సీబీఎఫ్ సీ సర్టిఫికేట్ అవసరం లేదని వివరణ ఇచ్చింది.

 

©️ VIL Media Pvt Ltd.