
డిసెంబర్ ఒకటో తేదీన వివాహ బంధంలోకి అడుగు పెట్టింది సమంత. ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సైలెంట్ గా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో రెండో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బయట పెద్దగా కనిపించని సమంత, తాజాగా భర్త రాజ్ నిడిమోరు తో మెరిసింది. ముంబై నుంచి వచ్చిన సమంతకు శంషాబాద్ విమానాశ్రయంలో వెల్‌కమ్ చెప్పారు రాజ్. రాజ్ కారు డ్రైవ్ చేస్తుండగా సమంత అతని పక్కన కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సమంత, నిర్మాతగా కొనసాగుతున్నారు. ట్రాలాలా పతాకంపై సమంత నిర్మాతగా ‘మా ఇంటి బంగారం’ రూపొందుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో