
సముద్రంలో 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తూ, బయట షార్క్‌లు, తిమింగలాలు, చేపల గుంపులు ఈదుతూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌వాటర్ అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. ఈ అండర్ వాటర్ సొరంగం ద్వారా దుబాయ్ నుంచి భారత్‌కు క్రూడ్ ఆయిల్ తరలిస్తారు. భారత్ నుంచి దుబాయ్‌కు తాగు నీటిని పంపిస్తారు. ఇలా ఒకేసారి రెండు కీలక సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 50 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ కానుంది. అయితే దీని వల్ల 50 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టి అవుతాయని, ముంబై అంతర్జాతీయ హబ్‌గా మారుతుందని, భారత్–యూఏఈ మధ్య ప్రయాణ ఖర్చులు 60 శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే చర్చలు మొదలైనట్టు సమాచారం. 2030 నాటికి ఇది వాస్తవ రూపం దాలిస్తే, రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో