
భారత మహిళా క్రికెట్ జట్టులో యువ సంచలనంగా మారిన వైష్ణవి శర్మ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఈ 20 ఏళ్ల బౌలర్, తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించింది. డిసెంబర్ 21న జరిగిన మొదటి మ్యాచ్‌లో వికెట్లు తీయకపోయినప్పటికీ, పొదుపైన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రెండో, నాలుగో మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.
మరిన్ని వీడియోల కోసం :