Reading Time: < 1 minute
Hrrific Road Accident Occurred In Jagtial District

ఇటీవల చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును టవేరా ఢీకొట్టింది. మెట్‌పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న టవేరా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి టవేరా వెహికల్ నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో ప్రయాణిస్తున్న కోరుట్లకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటక లోని గన్గాపూర్ దేవాలయానికి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం..

Also Read:MSVP : మన శంకర వరప్రసాద్ గారు’..చిరు, వెంకీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని మెట్‌పల్లి, కరీంనగర్, నిజామాబాద్ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ఉన్నట్లు సమాచారం. బస్సులు అగ్నిప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుంటుండడంతో ప్రయాణికులు వణికిపోతున్నారు.