Reading Time: < 1 minute
Rishab Shetty Kantara Chapter 1 Oscar Eligibility Production Rumors

వరాహ రూపం.. దైవ రిషితం! ఆ గంభీరమైన గొంతు, ఉప్పొంగే ఆవేశం, అడవి తల్లి సాక్షిగా సాగిన ఆ పోరాటం యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించాయి. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు ఈ సినిమా మూడో భాగం కోసం వేచి చూస్తున్న అభిమానులకు ఒక చేదు వార్త వినిపిస్తోంది. రిషబ్ శెట్టి ఆ మాయా ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నాడా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రిషబ్ శెట్టికి, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కు మధ్య తలెత్తిన విభేదాలే అని ఇండస్ట్రీ టాక్.

Also Read : Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, రిషబ్ తన తదుపరి ప్రాజెక్టుల్లో తన భార్య ప్రగతి శెట్టిని సహ నిర్మాతగా చేర్చాలని పట్టుబడుతున్నారట. తన సక్సెస్ జర్నీలో భాగమైన తన ఫ్యామిలీని బిజినెస్‌లోకి తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నారు. అయితే హోంబలే ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ బ్యానర్, రిషబ్ పెట్టిన ఈ కండిషన్‌కు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. గతంలోనే వీరి మధ్య కొన్ని ఆర్థిక పరమైన విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కాంట్రాక్ట్ గడువు ముగియడంతో, దాన్ని పునరుద్ధరించే క్రమంలో ఈ నిబంధనలు అడ్డంకిగా మారాయని, అందుకే ‘కాంతార’ తదుపరి భాగం ప్రస్తుతం హోల్డ్‌లో పడిందని సమాచారం.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రిషబ్ శెట్టి దైవాన్ని బలంగా నమ్ముతారు. ఇటీవలే ఆయన ‘కాంతార హరకె నేమోత్సవం’లో పాల్గొన్నప్పుడు, తదుపరి భాగం తీయాలా వద్దా అని దైవాన్ని ప్రార్థించగా సానుకూల సంకేతం లభించిందని ప్రచారం జరిగింది. దైవం నుంచి ఆదేశం వచ్చినా, ఈ నిర్మాణ వివాదాల వల్ల సినిమా పట్టాలెక్కకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇదే సమయంలో రిషబ్ ఇతర భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ ఛత్రపతి శివాజీ బయోపిక్ వంటి చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది కాబట్టి, ఒకవేళ వివాదాలు సర్దుమణిగినా ‘కాంతార-3’ రావడానికి చాలా కాలమే పట్టేలా ఉంది.