Reading Time: < 1 minute

రూ. 7 వేల కోట్ల భూమిని కాపాడండి..సబితా ఇంద్రారెడ్డి వినతి

Caption of Image.

ఇబ్రహీంపట్నం, వెలుగు: బాలాపూర్ మండలం నాదర్​గుల్​లోని సర్వే నంబర్ 613లో ఉన్న 373 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆమె అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో హైకోర్టు, ఆర్డీవో ఈ భూమిని ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పినప్పటికీ, ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు బౌన్సర్లతో రైతులను ఇబ్బంది పెడుతూ కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుమారు రూ. 7,000 కోట్ల విలువైన ఈ భూమి విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. ఈ భూమిని కాపాడే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీలు వాణీ దేవి, శ్రవణ్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

©️ VIL Media Pvt Ltd.