Reading Time: < 1 minute

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్.. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియంలో భారీ వర్షం కురవడంతో టాస్ ఆలస్యంగా వేయడం జరిగింది. ఈ కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దీంతో ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయబోతుంది. దీంతో తొలి ఇన్సింగ్స్ లో భారీ స్కోర్ చేసి అతిథ్య ఆర్ఆర్ టీమ్ పై ఒత్తిడి పెట్టాలనే టార్గెట్ ని బెంగళూరు జట్టు పెట్టుకుంది. 

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం.. పిచ్ పొడిగా ఉంటుందని భావించాం కానీ, గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో కొంత తేమ ఉండే అవకాశం ఉంది. మా జట్టు ఇప్పటి వరకు చాలా వ్యూహాత్మకంగా ఆడుతోంది. ముంబైపై సాధించిన విజయం గతం, ఈరోజు కొత్తగా మ్యాచ్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని మా కోచ్ సంగక్కర కూడా చెప్పారు. గెలిచి పాయింట్లు సాధించడమే మా లక్ష్యం.. ఈరోజు మ్యాచులో కొన్ని మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు పరాగ్ తెలిపాడు.

తుది జట్లు: 
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్

©️ VIL Media Pvt Ltd.