
న్యూ చంఢీగఢ్: శనివారం ఐపిఎల్-2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ విషయం అందరి దృష్టిని ఆకట్టుకుంది. అదేంటంటే.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు నల్లబ్యాడ్జీలు ధరించారు. అందుకు కారణం ఏంటని చర్చ జరుగుతోుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన పడవ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారికి నివాళిగా టీమ్ నల్ల బ్యాడ్జిలు ధరించినట్లు పంజాబ్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
‘‘పడవ ప్రమాదంలో మరణించిన వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో అండగా నివాలనుకుంటున్నాం’’ అని పంజాబ్ పేర్కొంది. మథుర సమీపంలో యమునలో పంజాబ్‌కి చెందిన పది మంది భక్తులు పడవ ప్రమాదంలో మరణించారు. స్వల్ప గాయాలైన 18 మందిని రెస్క్యూ బృందం రక్షించింది. మృతులు అందరూ పంజాబ్‌కు చెందిన వారే కావడంతో పంజాబ్ కింగ్స్ ఈ క్రమంలోనే నల్ల బ్యాడ్జిలు ధరించి నివాళులు ఆర్పించారని టీమ్ పేర్కొంది.
కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. పంజాబ్ విజయానికి ఇంకా 48 బంతుల్లో 70 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో శ్రేయస్(18), నేహల్(9) ఉన్నారు.