Reading Time: 2 minutes
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు.. అరబ్ దేశాల్లో రూ.16,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం.. ఎవరీ జెరెడ్ కుష్నర్?

Jared Kushner’s Net Worth: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ దౌత్యపరమైన చర్చల్లో అమెరికా ప్రతినిధిగా అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పేరు జెరెడ్ కుష్నర్. డొనాల్డ్ ట్రంప్ అల్లుడైన కుష్నర్, కేవలం రాజకీయ నేతగానే కాకుండా, మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో వేల కోట్ల పెట్టుబడులు కలిగిన దిగ్గజ వ్యాపారిగా గుర్తింపు పొందారు.

ఇరాన్ చర్చల్లో కుష్నర్ ఎందుకు కీలకం?

45 ఏళ్ల జెరెడ్ కుష్నర్‌కు విదేశాంగ విధానంలో పెద్దగా అధికారిక అనుభవం లేకపోయినా, ట్రంప్ ఆయనకు ఇరాన్‌తో చర్చలు జరిపే బాధ్యతను అప్పగించారు. కుష్నర్‌తో పాటు అమెరికా ప్రతినిధి బృందంలో వైస్ ప్రెసిడెంట్ జెడి వెన్స్ కూడా ఉన్నారు. ఇరాన్ తరపున ఆ దేశ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలిబాఫ్ పాల్గొంటున్నారు. కుష్నర్ గతంలో కూడా ఇరాన్‌తో చర్చలు జరిపారు. అయితే అప్పట్లో అవి ఒక కొలిక్కి రాలేదు.

ఇది కూడా చదవండి: YouTube Channel: AI సాయంతో యూట్యూబ్ ఛానెల్.. ఈ ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్.. భారీ ఆదాయం!

అరబ్ దేశాల్లో రూ.16,000 కోట్ల పెట్టుబడులు:

జెరెడ్ కుష్నర్ ప్రభావం కేవలం వైట్ హౌస్‌కే పరిమితం కాలేదు. ఆయన స్థాపించిన ‘అఫినిటీ పార్ట్‌నర్స్’ (Affinity Partners) అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ద్వారా మధ్య ప్రాచ్య దేశాల్లో భారీ నెట్‌వర్క్ నిర్మించుకున్నారు.

  • సౌదీ అరేబియా పెట్టుబడి: సౌదీ అరేబియాకు చెందిన ‘సావరిన్ వెల్త్ ఫండ్’ (PIF) కుష్నర్ కంపెనీలో ఏకంగా 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,000 కోట్లు) పెట్టుబడి పెట్టింది.
  • ఖతార్, యూఏఈ: సౌదీతో పాటు ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుండి కూడా ఆయన సంస్థకు భారీగా నిధులు అందుతున్నాయి. ఈ ఆర్థిక సంబంధాల వల్లే ఆయన దౌత్యం కంటే వ్యాపార ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు కూడా ఉన్నాయి.

బిలియన్ డాలర్ల సామ్రాజ్యం:

ఫోర్బ్స్ 2025 నివేదిక ప్రకారం.. జెరెడ్ కుష్నర్ నికర ఆస్తి విలువ 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) దాటింది. న్యూజెర్సీకి చెందిన రియల్ ఎస్టేట్ కుటుంబంలో జన్మించిన ఆయన, తన కుటుంబ వ్యాపారమైన ‘కుష్నర్ కంపెనీస్’ను కొత్త శిఖరాలకు చేర్చారు.

ఇది కూడా చదవండి: Dubai Gold: దుబాయ్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? మన దేశంలోని ధరలతో పోలిస్తే ఎంత తేడా?

ఇవాంకా ట్రంప్‌తో వివాహం:

2009లో డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను కుష్నర్ వివాహం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇవాంకా యూదు మతాన్ని స్వీకరించారు. ప్రస్తుతం ఇవాంకా ట్రంప్ సొంత ఆస్తి విలువ కూడా సుమారు 100 మిలియన్ డాలర్లు (రూ.830 కోట్లు)గా ఉంది. వ్యాపారం, రాజకీయాల కలయికతో జెరెడ్ కుష్నర్ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా ఎదిగారు. ముఖ్యంగా అరబ్ దేశాలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు అమెరికా విదేశాంగ విధానాన్ని ఎలా మారుస్తాయో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Gold Reserves: అత్యధిక బంగారం ఏ దేశం వద్ద ఉంది? భారత్‌ ఏ స్థానంలో? టాప్‌ -5 దేశాలు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి