
హైదరాబాద్: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. మంత్రి పొంగు లేటి శ్రీనావాస్ రెడ్డి పై కెటిఆర్ ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోర్త్ సిటీ ఒక డ్రామా..తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్రని, నిషేధిత భూముల జాబితాల్లో బ్లాక్ మెయిల్ రాజకీయాలు అని కెటిఆర్ విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని, కోహెడలో 178 ఎకరాల భూమి అమ్ముకునేందుకు ప్రయత్నమని మండిపడ్డారు. ఉన్నసిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ కు లేదని, ఫ్యూచర్ లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ కడతా అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, అధికారులు కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని కెటిఆర్ కోరారు.